తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేష్..! 23 d ago
సినీ నటి కీర్తి సురేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కీర్తి సురేష్ తన కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దర్శనం పూర్తయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ "డిసెంబర్ నెలలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు" తెలిపారు. పెళ్లి వేడుక గోవాలో జరగబోతుందని చెప్పారు. కీర్తి సురేష్ నటించిన "బేబీ జాన్" డిసెంబర్ 25న రిలీజ్ కానుంది.